ప్రజాశక్తి-యంత్రాంగం ప్రభుత్వ సేవలు నూరు శాతం అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పలువురు అన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమాలు చేపట్టారు. కరప చిరంజీవి కళ్యాణ మండపంలో జగనన్న సురక్ష శిబిరాన్ని రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. సర్వీస్ రిక్వెస్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల పరిశీలన కౌంటర్లను పరిశీలించారు. శిబిరానికి హాజరైన స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి, జెడ్‌పిటిసి వై.సుబ్బారావు, ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి, సర్పంచ్ ఎస్.ఆశాజ్యోతి, తహశీల్దారు పి.శ్రీనివాసరావు, ఎంపిడిఒ కె.అప్పారావు పాల్గొన్నారు. పెద్దాపురం పాత పెద్దాపురంలోని 1, 2 వార్డుల్లో ఆర్‌డిఒ జె.సీతారామారావు, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్ర, డిప్యూటీ తహశీల్దారు పి.విజరు కుమార్, మేనేజర్ యు.జ్యోతిరాణి, చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి పాల్గొన్నారు. రౌతులపూడి శృంగవరంలో 320 మంది లబ్ధిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లను ప్రతిపాడు ఎంఎల్‌ఎ పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ అందజేశారు. ప్రత్యేకాధికారి ఎస్‌విఎస్.సుబ్బలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జిగిరెడ్డి రమణమ్మ. వైస్ ఎంపిపి తిరుమల రాయలు, డిసిసిబి డైరెక్టర్ మధు, తహశీల్దారు భీమారావు, ఎంపిడిఒ గోవింద్, సర్పంచ్ ఏసుబాబు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ జిల్లా సహాయ కలెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు. ఉండూరులో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిడిఒ డి శ్రీలలిత, మున్సిపల్ కమిషనర్ జె.రామారావు, చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కష్ణమూర్తి, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు పిల్లంక సచివాలయంలో తహశీల్దారుఎ పోతురాజు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్షలో ఎంపిపి రాయుడు సునీత, చింతలపాటి శ్రీనివాసరాజు, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, రాయుడు గంగాధర్, ధూళిపూడి బాబి, ప్రత్యేకాధికారి లక్ష్మీనరసయ్య, పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ 1 ఎ, 8 ఎ, 15 ఎ, 22 ఎ, 29ఎ, 43ఎ సచివాలయాల్లో జగనన్న సురక్ష ప్రారంభించారు. ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, అదునపు కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు పాల్గొన్నారు. జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటి బాబు సచివాలయం1లో పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వసంత కుమార్, తహశీల్దార్ శ్రీదేవి, బండారు రాజా, డాక్టర్ వొమ్మి రఘురాం, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాజులూరు అండ్రంగిలో వనుం వెంకట సుబ్బారావు, డిడిఒ అన్నామణి, తహశీల్దారు సాయి సత్యనారాయణ, రత్నం రాజు ఎంపిపి మాత భారతి మురళి, సర్పంచ్ పెద్దిరెడ్డి నాగ సుజాత పాల్గొన్నారు.










