ప్రజాశక్తి-కశింకోట
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. కశింకోట సచివాలయం-4 కుమ్మరి వీధి శివాలయం, కోమటవీధి ప్రాంతాల్లో మంగళవారం వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు ఆధ్వర్యంలో మంత్రి అమర్‌నాథ్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీవీధిలో రూ.30 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం వద్ద స్వామి వివేకానంద విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు, సర్పంచ్ మంత్రి జయరజని, జడ్పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, ఉపసర్పంచ్ నడిపల్లి లక్ష్మి నాయుడు, ఎంపీటీసీ చేవ్వేటి చంద్రమ్మ, మంత్రి పీటర్ వైజమెన్ పాల్గొన్నారు.
పరవాడ : జివిఎంసి 79వ వార్డు లంకెలపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మంగళవారం నిర్వహించారు. ప్రజల నుండి అనేక సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అన్నంరెడ్డి అజరు రాజ్, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు, సుందరపు అప్పారావు, దాసరి తాతారావు, యలమర్తి వెంకట రావు, కింతాడ ఈశ్వరరావు, జి పూర్ణనందాశర్మ, శీలం నదియా, ఆశాజ్యోతి, కర్రి అప్పారావు, కతా నూకరాజు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని మార్టూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిశారు. పాఠశాలలో గుడ్డు పెడుతున్నారా, భోజనాలు బాగుంటున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ యు.సుకుమార్ వర్మ, జెడ్పిటిసి సభ్యులు లా లం రాంబాబు, వైసిపి నాయకులు దేశంశెట్టి శంకర్రావు, కోన బుజ్జి, కె.విమలా నాయుడు, రాజాన పైడిభాస్కరరావు, సర్పంచ్ కె రమేష్ బాబు, స్థానిక నాయకులు కెవి రమణ, కేకే శ్రీనుబాబు, గుర్రం అప్పారావు పాల్గొన్నారు.










