Jun 07,2023 23:17

ప్రజాశక్తి-యంత్రాంగం అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని ఎపి కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తం చేపట్టిన కౌలు రైతుల రక్షణ యాత్ర జిల్లాలో పటుచ్లో బుధవారం సాగింది. సిసిఆర్‌సి చట్టం సవరించాలని, భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతు కార్డు ఇవ్వాలని కోరారు. కరప మండలంలోని నడకుదురు, పెనుకుదురు, కరప, వలసపాకల, యండమూరు గ్రామాల్లో రైతు రక్షణ యాత్ర సాగింది. ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకష్ణ మాట్లాడుతూ ఈ రక్షణ యాత్ర ఈ నెల 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో బయల్దేరి రాష్ట్రమంతా ప్రచారం చేసి 12వ తేదీన విజయవాడ నుంచి మంగళగిరి సిసిఎల్‌ఎ కార్యాలయం వరకూ సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వల్లు రాజబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు రమేష్‌ లంక చందర్రావు, ఎస్‌.చిన్నారావు బి.రాజు, కౌలు రైతులు పాల్గొన్నారు. కాజులూరు మండలంలో గొల్లపాలెం, చేదువాడ, తిప్పరాజుపాలెం, కాజులూరు, శీలలంక గ్రామాల్లో ప్రచార జాతా సాగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకష్ణ జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, పాలెపు ఈశ్వరరావు, అల్లాడి నరసింహమూర్తి, పెనుమల్ల కురుపూడి రాంబాబు, గంజా అప్పారావు, చింతపల్లి లోవరాజు, పెంకే శ్రీనివాస్‌, మాజీ సర్పంచులు పెంకే సూర్యనారాయణ, వనం వీరబ్రహ్మం పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం మెయిన్‌ రోడ్డుపై చెరువుగట్టు సెంటర్‌ వద్ద కౌలు రైతులను ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడారు. జీపు జాతా చెరువుగట్టు సెంటర్‌, పోలేకుర్రు, పత్తిగొంది, జార్జి పేట, పెద్దబాపనపల్లి, లచ్చిపాలెం, ఇంజరం గ్రామాలలో పర్యటించింది. పలుచోట్ల కరపత్రాలు పంచుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలెపు ఈశ్వర రావు, దడాల అబ్బులు, వాసంశెట్టి సత్తిబాబు, గుత్తుల చెన్నయ్య, పిల్లి నాని, పంచగట్ల రామకృష్ణ, బల్ల అప్పారావు, పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు.