ఓటర్ల నమోదును పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : అర్హులైన ప్రతిఒక్కరినీ ఓటరుగా చేర్పించే బాధ్యతను బిఎల్‌ఒలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని తోనాం పంచాయతీ పరిధిలో గడపగడపకు వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే ఇంటి నంబర్‌పై పది మందికి మించి ఓటర్లు ఉంటే, 11వ నంబర్ నుండి వేరే ఇంటి నంబర్ ఇచ్చి వారిని ఓటరుగా చేర్చాలని సూచించారు. జీరో ఇంటి నంబర్లు రాకుండా చూడాలన్నారు. గ్రామం నుంచి ఎవరైనా బయట ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోతే వారి సమాచారం సేకరించి, ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బాలమురళీకృష్ణ సర్పంచ్ మువ్వల ఆదయ్య, పంచాయతీ కార్యదర్శి అలీషా పాల్గొన్నారు.










