Jul 11,2023 21:24

బిఎల్‌ఒల సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌

కురుపాం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కులో చేర్పించాల్సిన బాధ్యత బిఎల్‌ఒలదేనని సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఆర్‌.రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన బిఎల్వోలకు ఓటు హక్కు, చేర్పులు, మార్పులపై అవగాహన కల్పించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో మండలంలో గల బిఎల్వోలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బిఎల్‌ఒలతో సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ వచ్చే లోపు ప్రతి బిఎల్‌ఒ ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వేను నమోదు చేయాలని అన్నారు. గ్రామాల్లో మృతి చెందిన వారిని ఓటర్ల లిస్టు నుంచి తప్పించి కొత్త ఓట్లు నమోదు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటును నమోదు చేయాలని అన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సహించేది లేదని అన్నారు. ఆయన వెంట తహశీల్దార్‌ జె.రాములమ్మ ఉన్నారు.