Aug 30,2023 00:29

ప్రజాశక్తి - పర్చూరు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో ఆయన మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్వోలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పని చేయాలని సూచించారు. యదార్ధంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రసక్తి లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయని ఇటీవల కొందరు నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడంతో విచారణ నిమిత్తం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్‌ను నియమించారు. అందులో భాగంగా ఆయన పర్చూరు వచ్చి  వివిధ పార్టీల నాయకులు, అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇఆర్‌ఒ వెంకట నారాయణ, తహశీల్దార్ సంధ్యశ్రీ, పాల్గొన్నారు.