Sep 01,2023 23:49

ప్రజాశక్తి - వేటపాలెం
వైసిపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నట్లు వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ ప్రాంగణంలో నూతనంగా మంజూరైన వివిధ రకాల పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు. అర్హత ఉండి పెన్షన్ రావటం లేదనే వారు ఎవరైనా ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని చెప్పారు. వేటపాలెం మండలానికి 275నూతన పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. మరో 301 పెన్షన్లు రానున్న రోజులలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె నేతాజీ, సూపర్నెంట్ ఎంవిఎస్ శర్మ, ఎఒ ఐ కాశీ విశ్వనాథం, రామన్నపేట సర్పంచి కందేటి రమణ, వైసిపి నాయకులు పల్లపోలు శ్రీనివాసరావు, అందే కృష్ణ, బొడ్డు సుబ్బారావు, మస్తాన్, పులి వెంకటేశ్వర్లు, లేళ్ల శ్రీధర్, దంతం హనుమంతరావు పాల్గొన్నారు.