Jul 12,2023 00:23

ప్రజాశక్తి-యంత్రాంగం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. కాజులూరు ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం ఆయన మండలంలోని జగన్నాథగిరిలో గ్రామంలో గ్రామ సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో హాజరయ్యారు. గ్రామ సచివాలయం పరిధిలో ఇంటింటా సర్వే చేసి తీసుకున్న దరఖాస్తులను జగనన్న సురక్ష శిబిరంలో పరిష్కరిస్తున్న విధానాన్ని మంత్రి వేణుగోపాలకష్ణ పరిశీలించారు. ఈ జగనన్న సురక్ష శిబిరంలో మొత్తం 370 మందికి కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలుబీ పభ్రుత్వ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సుబ్బారావు, ఎంపిపి ఎం.భారతి మురళి, ఎంపిటిసి లక్ష్మి, తహసీల్దార్‌ సాయి సత్య నారాయణ, ఎంపిడిఒ రత్న రాజు, జగన్నాథగిరి గ్రామ సర్పంచ్‌ అచ్యుతాంబ అరుణ, మాజీ సర్పంచ్‌ కోటాని గణేశ్వరరావు ఈశ్వరి పాల్గొన్నారు. తాళ్లరేవు జార్జిపేట సచివాలయంలో సర్పంచ్‌ పేర్ని ఆదినారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్ష సభలో 457 మందికి పలు రకాల సర్టిఫికెట్లను అందించారు. ఎంపిడిఒ ఎం.అనుపమ, ప్రత్యేక అధికారి లక్ష్మీనరసయ్య, ఎంపిపి రాయుడు సునీత, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌, రాయుడు గంగాధర్‌, ధూళిపూడి బాబి, రెడ్డి నాగేశ్వరరావు, జగదీష్‌, మందపల్లి రాంబాబు, అరవింద్‌, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి పాల్గొన్నారు. గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొని మాట్లాడారు. జెడ్‌పిటిసి పరిమి బాబు, ఎంపిపి చలగళ్ల దొరబాబు, జాస్తి వసంత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనపరెడ్డి బాబు, కిర్లంపూడి ఎంపిపి తోట రవి, గండేపల్లి మండలం జెసిఎస్‌ కన్వీనర్‌ మధు కుమార్‌, ఎంపిడిఒ వెంకట్‌ రామన్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ అడబాల రామాంజనేయులు పాల్గొన్నారు. ఏలేశ్వరం చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి 2, 18, 19 వార్డు సచివాలయాలయాల్లో లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌లు మసరపు బుజ్జి, త్రివేణి, ఎండగుండి నాగబాబు, కమిషనర్‌ కెఎ.కొండలరావు, మేనేజర్‌ శ్రీనివాసరావు, టిపిఒ ఆనంద్‌, జి ఆర్‌ కె వి ప్రసాద్‌ ఉన్నారు.