నరసరావుపేట: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా, సమర్థవంతంగా అమలు చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో సచివాలయ కార్యదర్శులకు, వార్డు వాలం టీర్లకు జగనన్న సురక్ష కార్యక్రమం అమలు గురించి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా తీసుకొని అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, క్రమశిక్షణ సమయపాలన విధుల పట్ల అంకితభావంతో సచివాలయ , వార్డు వాలంటీర్లు పనిచేయాలని ఆదేశించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహనరావు తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. సత్తెనపల్లి రూరల్:ప్రజా సమస్యలను సంతప్తి స్థాయిలో పరిష్కరించడం, అర్హులు ఎవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో జీవి సత్యనారాయణ వెల్లడించారు. సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్య క్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ సురేష్ మాట్లాడుతూ తొలి దశలో గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు వాలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శించి సురక్ష కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం గురించి స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ ఆడిటోరియంలో వాలంటీర్లకు అవగాహన, విధి విధానాలపై సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ విజయ శ్రీ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రతి సచి వాలయంలో ఒకరోజు ఉండి అర్జీలను వెంటనే పరి ష్కరిం చాలని అన్నారు. అనంతరం మండల ఎంపీడీవో మాధురి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు సక్రమంగా చేయాలని, అశ్రద్ధ వహించి నిర్లక్ష్యం చేసే వాలంటీర్ల పై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.










