Sep 14,2023 21:10

ప్రభుత్వ పథకాల ప్రచార బ్రోచర్‌ను అందజేస్తున్న ఎమ్‌పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

వంగర: అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లు అన్నారు. మండలంలోని తలగాంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉత్తరావెళ్లి సురేష్‌ ముఖర్జీ, వైసిపి మండల కన్వీనర్‌ కరణం సుదర్శన రావు, వైస్‌ ఎంపిపి కిమిడి ఉమామహేశ్వరరావు, బొకేల వెంకట అప్పలనాయుడు, సంకిలి రాధ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.