Sep 14,2023 00:19

ప్రజాశక్తి - నగరం
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పదకాలు అందజేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. మండలంలోని ఏలేటిపాలెం, చిరకాలవారి పాలెం, బోరమాధిగపల్లి పంచాయతీలలో గడప గడపకు ప్రబుత్వ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పదకాలు అమలు చేస్తున్న జగన్‌ మళ్లీ సిఎం కావాలని ప్రజలు ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏలేటివారిపాలెం పంచాయతీ వెలమావారిపాలెంకు చెందిన మెరుగుపాల సతీష్ కుటుంబానికి రూ.6లక్షల  సిఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. గ్రామంలో రామ మందిరం అభివృద్ధికి రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం ఎంపిపి మోపిదేవి నిర్మల హరినాథ్, నగరం ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య, జడ్పీటిసి మాన్నెం నాగమణి, ఏలేటిపాలెం సర్పంచ్ పి జాఫర్, వైసీపీ జిల్లా కార్యదర్శి నిజాంపట్నం కొటేశ్వరరావు, ఉపసర్పంచ్ నల్లూరి రత్నబాబు, పెద్దలు రాఘవరావు పాల్గొన్నారు.