ప్రజాశక్తి-నందిగామ
అర్హతే ప్రామాణికంగా ఇంటింటికి సంక్షేమం అని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. పట్టణంలోని 10 వ వార్డు పరిధిలో బుధవారం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ - ప్రభుత్వ పనితీరును వివరించారు.ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అర్హత ప్రామాణికంగా ఇంటింటికి సంక్షేమాన్ని అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ జయరాం ,ఏఈ రమేష్ , కౌన్సిల్, కో ఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్చార్జిలు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










