ప్రజాశక్తి-చీరాల: ఎమ్మెల్సీ సునీతకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, నాడు టిడిపిలో లబ్ధి పొంది నేడు స్థాయి మరచి పార్టీ మారిన ఆమె ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు అన్నారు.బుధవారం చీరాల నియోజకవర్గంలోని రామకష్ణాపురం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో కాండ్రు శ్రీనివాసరావు మాట్లాడారు. చంద్రబాబునాయుడు దయతో పోతుల సునీతకు చీరాల టీడీపీ టికెట్ ఇచ్చారని, 2014 ఎన్నికల్లో ఓడిపోయినను ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే నేడు ఆయనను వెన్నుపోటు పొడిచిన నీకు విమర్శించే అర్హత లేదని శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. నేడు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం బిసిలను వెన్నుపోటు పొడుస్తుంటే సునీత లాంటి నాయకులకు కనపడట్లేదా, ముందు మీ నాయకుల గడ్డి బొమ్మలను తగలబెట్టండి అని అన్నారు. బిసి వర్గాల అభివద్ధి టీడీపీతోనే సాధ్యమైనదని, సునీత లాంటి బిసి నాయకులను చట్టసభలకు పంపినది చంద్రబాబు నాయుడు అని అన్నారు. బిసిలను టిడిపి గౌరవిస్తుందని, దానికి చీరాల నియోజకవర్గమే ఒక నిదర్శనమని కాండ్రు శ్రీనివాసరావు అన్నారు. సమావేశంలో టీడీపీ పద్మశాలి సాధికారత రాష్ట్ర డైరెక్టర్ దామర్ల మనోహర్, చాట్రాసి బాల వెంకటేశ్వర్లు ,శివ శంకర్, రమేష్, జంజనం వెంకట్రావు పాల్గొన్నారు










