ప్రజాశక్తి - మంత్రాలయం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనపై ఉన్న ఆదరణ తెలిసిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. మంగళవారం చంద్రబాబుకు కండిషన్ బెయిల్ మంజూరు కావడంతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధిపై ఒక విజన్ ఉన్న చంద్రబాబును కక్ష సాధింపుతోనే అరెస్టు చేశారని తెలిపారు. ఆయన అరెస్టు వల్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, అదే చంద్రబాబుపై ఆదరణకు నిదర్శనమని చెప్పారు. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' ద్వారా గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు బూదూరు మల్లికార్జున రెడ్డి, ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, చావిడి వెంకటేష్, అమర్‌నాథ్‌రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మీడియా ఇన్‌ఛార్జీ విజయరామిరెడ్డి, గోపాల్ రెడ్డి, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ వట్టేప్ప గారి నరసింహ, నాగేష్, జ్ఞానేష్, ఈరన్న, తిక్కస్వామి గౌడ్, మారెప్ప, హండే హనుమంతు పాల్గొన్నారు. కోసిగిలోని వాల్మీకి సర్కిల్‌లో బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. టిడిపి మండల కన్వీనర్ జ్ఞానేశ్, భరద్వాజ్ శెట్టి, నాడిగేని అయ్యన్న, వక్రాని వెంకటేష్, నాడిగేని రంగన్న, కొండగేని వీరారెడ్డి, రవితేజ శెట్టి, మాదేవా, నర్సిరెడ్డి, గవిగట్టు ఈరయ్య, శ్రీనివాసులు, నారాయణ, ఉరుకుందు, బసవ, నరసింహులు, హనుమంతు, హుసేని పాల్గొన్నారు.
మంత్రాలయంలో సంబరాలు చేసుకుంటున్న నాయకులు










