
జ్యోతిప్రజ్వలన చేస్తున్న దృశ్యం
ఆర్‌ఎస్‌ఆర్‌ని సందర్శించిన
మలేషియా యూనివర్సిటీ బృందం
ప్రజాశక్తి-బిట్రగుంట:ద్య, పరిశోధన అంశాల పై పరస్పరం సమాచారం , సహకారం ఇచ్చి పుచ్చుకోవడానికి కావాల్సిన అంశాలను చర్చించడానికి మలేషియా వర్సిటీ అధికారులు డాక్టర్లు మహ్మద్ అబ్దుల్ కరీం, డాక్టర్ మొహమ్మద్ ఆరీఫుల్లా గురువారం కడనూతల గ్రామంలోని ఆర్‌ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ మలేషియా వర్సిటీ అధికారులు ,ఆర్ ,ఎస్, ఆర్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రాజా రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి. వీర నారాయణ రెడ్డి అన్ని విభాగాధిపతులతో సమావేశమై పలు అంశాలపై చర్చించామని తెలిపారు. పరిశోధన అంశాలలో సహకారం ఎక్స్చేంజి కార్యక్రమంలో భాగంగా ఆర్,ఎస్,ఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మలేషియా వర్సిటీలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. కార్యక్రంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ రాజా రెడ్డి , ప్రిన్సిపల్ డాక్టర్ వీర నారాయణ రెడ్డి, ఎఒ,రమణారెడ్డి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.