సత్తెనపల్లి రూరల్: ఆర్‌ఎంపి,పిఎంపి ల సమస్యలు పరిష్కరిస్తానని సత్తెనపల్లి టిడిపి ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. కన్నా లక్ష్మీ నారాయణను ఆదివారం ఆర్‌ఎంపి,పిఎంపి కమిటీ సభ్యులు కలిసి వారి సమస్యలను వివరించారు. వారి సమ స్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కన్నా లక్ష్మీనారా యణను ఘనంగా సత్కరించారు. కన్నాను కలిసిన వారిలో అమరావతి ఆర్‌ఎంపి, పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు కాకుమాను నాగే శ్వరరావు, కమిటీ సభ్యులు,అంకమ్మరావు, షేక్ సైదా,బ్రహ్మం, మల్లికార్జున రావు,తొండపి సైదా,గోవిందా చారి, పి. శ్రీనివాసరావు, బి.శ్రీను, వెంకటేశ్వర్లు, భద్రాచారి, సాంబశివ రావు ఉన్నారు
టిడిపి నాయకుడికి పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్తెనపల్లి మండలం గర్నెపూడికి చెందిన టిడిపి గ్రామ కార్యదర్శి పురం ఆదామును ఆదివారం కన్నా లక్ష్మీనారా యణ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ గుం టూరు లోని ప్రైవేట్ వైద్యశాలలోచికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఆదామును పరామర్శించారు . ఆస్పత్రి డాక్టర్ తో మాట్లాడి ఆదాం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆదామ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కొంత ఆర్థిక సహాయాన్ని ఆదాము కుటుంబ సభ్యులకు అందించారు.










