Nov 06,2023 23:10

ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సిఎం జగన్‌ చేసిన ప్రజాసంకల్పయాత్ర నవంబర్‌ 6వ తేదీకి ఆరేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్బంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు సోమవారం సంబరాలు నిర్వహించారు.
మామిడికుదురు ప్రజాసంకలపం యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని సిఎం జగన్‌ గ్రామాల ముంగిటలోకి పాలన తెస్సరని పి.గన్నవరం ఎం. ఎల్‌.ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. ప్రజాసం కల్పనికి ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారం నగరం హైస్కూల్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎల్‌ఎ తనయుడు కొండేటి వికాస్‌ కేక్‌ కట్‌ చేసి ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు కె.అంజి బాబు, మండల శాఖ అధ్యక్షులు కొమ్ముల రాము, ఎంపిటిసి సభ్యుల సమాఖ్య అధ్య క్షులు నెల్లి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పి.గన్నవరం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సిఎం జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేసి నేటికీ ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పి.గన్నవరంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎంఎల్‌ఎ తనయుడు కొండేటి వికాస్‌ తదితరులు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. కార్యక్రమంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు తోరేటి బంగారు నాయు డు ,పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.