Sep 09,2023 01:25

ప్రజశక్తి - చీరాల
మున్సిపల్ అధికారుల పనితీరు దారుణంగా ఉందని, అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఏమిటని, ఇది దుర్మార్గపు చర్యని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లోని అంబేద్కర్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు మాట్లాడారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య  విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారుల తీరు విడ్డూరంగా ఉందన్నారు. అంబేద్కర్ వాదులు,  ప్రజాసంఘాల నిర్ణయాలకు కట్టుబడి నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారులు, పాలకులు కలసి ఎవరికి తెలియకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజాభిప్రాయంతో పని లేకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. జరుగుతున్న దుర్మార్గ సంఘటనలు ఖండించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం, ఎల్‌ జయరాజు, భాస్కర్, విజయ, డేవిడ్, అశోక్ పాల్గొన్నారు.