ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్ గ్రామంలో ఆర్‌డిటి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముళ్లకంపను తొలగించారు. ఎటిఎల్ రియనా ఆదేశాల మేరకు ఆర్‌డిటి, పొదుపు గ్రూపు మహిళలు స్వచ్ఛందంగా ఎస్సీ కాలనీ నుంచి గంజిహల్లి గ్రామానికి, వ్యవసాయ పొలాలకు వెళ్లే దారికి, దళితుల శ్మశాన దారికి ఇరువైపులా ముళ్లకంపను శనివారం తొలగించారు. మహిళలు ప్రతి సోమవారం, మంగళవారం ఒకరోజు శ్రమదానం లాగా 'మన ఊరు.. మనమే బాగుచేసుకుందాం, పరిశుభ్రత పెట్టుకుందాం' అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా సర్పంచి అరుణ్ కుమార్ హాజరయి వారితో కలిసి ముళ్లకంపను తొలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్‌డిటి పొదుపు మహిళలు ఐక్యతతో స్వచ్ఛందంగా గ్రామానికి సేవా చేయాలని, వారిని ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు. తెర్నేకల్ ఆర్‌డిటి టీం లీడర్ నరసప్ప, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
ముళ్లకంప తొలగింపులో పాల్గొన్న సర్పంచి అరుణ్ కుమార్