Jun 14,2023 21:15

ఆర్‌డిఒను చుట్టుముట్టిన రైతులు

చాపాడు : నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే అనుసంధాన రోడ్డు కు భూములు కోల్పోతున్న రైతులు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు ను చుట్టుముట్టారు. బుధవారం బద్రి పల్లె, పిచ్చపాడు గ్రామాలకు చెందిన రైతులతో ఆర్డిఓ సమావేశాన్ని నిర్వహించారు. పిచ్చ పాడు గ్రామ రైతులకు రూ. 15 లక్షలు నష్టపరిహారం అందుతుందని ఆర్డీఓ సూచించారు. నేషనల్‌ హైవే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని నష్టపరిహారం పెంచడం తమ పరిధిలో ఉందన్నారు. బహిరంగ మార్కెట్‌ లో రూ. కోటి వరకు ధర పలుకుతుందని ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆర్డిఓను రైతులు చుట్టుమట్టారు. రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని రైతుల కోరారు. అర్జీ రూపంలో రైతులు అందజేస్తే ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తామని ఆర్డీఓ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సుభాని, సర్వేయర్‌ స్నేహ లత, వి ఆర్‌ ఓ సుబ్బన్న, రెవిన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.