అభినందనలు తెలుపుతున్న జర్నలిస్టులు
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో జయరామ్‌ను ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ చింతల, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పారావు, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ పసుపులేటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా అధ్యక్షుడు విజరు పాల్గొన్నారు.










