Jul 27,2023 21:49

రీసర్వేను పరిశీలిస్తున్న కమిషనర్‌ రామప్పలనాయుడు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  అర్బన్‌ రీ సర్వేకు పట్టణ ప్రజలంతా సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జె.అప్పలనాయుడు అన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంలో భాగంగా ఇటీవల పార్వతీపురం అర్బన్‌లో గల 3,100 ఎకరాలు (12.58 చ,, కి,మీ) విస్తీర్ణం గల వ్యవసాయ, నివాస స్థలాలు రీ సర్వే ప్రారంభమైన దృష్ట్యా గురువారం రీసర్వే జరుగుతున్న ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ అర్బన్‌ పరిధిలో 13,780 పైగా గల నివాస, నివాసాయేతర భవనాలను 1,500 ఎకరాలకు పైగా గల వ్యవసాయ భూములను, 880 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాల సరిహద్దులను నిర్ణయించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలంతా తమ ఆస్తులకు సంబంధించిన భూ రికార్డులను వార్డు సచివాలయాల రెవెన్యూ సెక్రెటరీ, ప్లానింగ్‌ సెక్రటరీలకు అందజేసి మీ భూములకు సంబంధించి నిజనిర్ధారణ తేల్చుకోవాలని అన్నారు. అనంతరం కమిషనర్‌ వెంకంపేటలో గల జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న 176 ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లేఔట్‌లో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యానికి గృహ నిర్మాణశాఖ అధికారు లతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు, హౌసింగ్‌ డిఇ ప్రసాదరావు, ఎఇ అప్పలనాయుడు, మున్సిపల్‌ ఎఇ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.