వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
అర్బన్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య కళాశాల ప్రాంగణంలో ఉచిత మెడికల్ క్యాంప్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పస్పిల్ మున్నా మాట్లాడుతూ డాక్టర్లు ప్రజలకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపుగా 400 మంది క్యాంపులో పాల్గొని ఉచితంగా మందులు తీసుకొని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శాంతిరామ్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజరు భాస్కర్ నాయుడు, తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకుడు ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.










