
ప్రజాశక్తి - ఆచంట
సామాజిక తనిఖీ, గ్రామసభల అనంతరం ఇ-క్రాప్ జాబితాలను అన్ని ఆర్‌బికె కేంద్రాల్లో ప్రచురిస్తున్నట్లు మండల వ్యవసాయ విస్తరణాధికారి బి.నాగరాజు తెలిపారు. పంట నమోదు గ్రామసభల నిర్వహ ణ కార్యక్రమాన్ని సర్పంచి సుంకర సీతారామ్ అధ్యక్షతన సోమవారం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. 2023 ఖరీఫ్ పంటకు సంబంధించి ఇ-క్రాప్ ముసాయిదా జాబితాను మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రచురించినట్లు ఎఇఒ తెలిపారు. సామాజిక తనిఖీ నిమిత్తం మండలంలో 15 రైతు భరోసా కేంద్రాల వద్ద ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామసభలు నిర్వహి ంచినట్లు తెలిపారు. సర్పంచి సుంకర సీతారామ్ మాట్లా డారు. ఈ కార్యక్రమంలో విఎఎ, విహెచ్‌ఎ, రైతులు పాల్గొన్నారు.