ప్రజాశక్తి-చీరాల: మండలంలోని గవినివారిపాలెం-1 ఆర్‌బికెను జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌బికేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విధానం గురించి అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడులు గురించి విఎఎలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌బికె ద్వారా ఎంత మోతాదులో ఎరువులు పంపిణీ చేశారో అనే విషయం గురించి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు రబీ 2022-23కు గోతాలు, ట్రాన్స్‌పోర్ట్, లేబర్ సౌకర్యాలు సమకూర్చు కోవాలని పాక్స్ అధికారులకు తెలియజేశారు. మరియు వీటికి గాను అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. చీరాల మునిసిపాలిటీ నుంచి వచ్చే మురుగునీరు బుర్లవారిపాలెం, గవినివారి పాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కలవటం వలన సాగు భూమి బీడు భూమిగా 5వేల ఎకరాలలు తగు చర్యలు చేపట్టాలని అని రైతులు తెలిపారు. భూసార పరీక్షలు చేయించి పోషకాల నివారణకు పచ్చిరొట్ట పైర్లు ఉపయోగించాలని రైతులకు తెలియచేయాలని, భూసార పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌కె అబ్దుల్ సత్తార్, సివిల్ సప్లై డిఎస్‌ఓ విలియమ్స్, ఆర్‌డిఓ రవీంద్ర, తహశీల్దారు జె ప్రభాకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.










