సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి-జి.మాడుగుల:పాలమామిడి, వంజరిలో రైతు భరోసా కేంద్రం, షోలభం పంచాయతీ గొందిపాడు గ్రామంలో సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కోటగుళి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కుడుములు సత్యనారాయణ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.










