Sep 06,2023 21:30

చీఫ్‌విప్‌ ప్రసాదరాజు
ప్రజాశక్తి - మొగల్తూరు

            నరసాపురం నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బి రహదారుల అభివృద్ధికి రూ.80 కోట్ల్ల నిధులు వెచ్చిస్తున్నామని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కెపి.పాలెం నార్త్‌లో బుధవారం రూ.2.50 కోట్ల నిధులతో రహదారి అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగల్తూరు నుంచి కొండావారిపాలెం మీదుగా పాలకమ్మ చెరువు వరకు రహదారి పనులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మొగల్తూరు మండలంలో ఎనిమితి రహదారులు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కొత్తకాయలతిప్పకు గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రసాదరాజును కోరారు. గ్రామాల్లో సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, సర్పంచి కడలి సోంబాబు, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, కర్రి ఏసుబాబు, కొల్లాబత్తుల రవికుమార్‌, కందులపాటి ముత్యాలరావు, లక్కు బాలాజీ పాల్గొన్నారు.