
ప్రజాశక్తి- లావేరు: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓట్లుతో తరిమికొట్టాలని మాజీమంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, ఎచ్చెర్ల ఇన్‌ఛార్జి కిమిడి కళావెంకటరావు అన్నారు. మండలం అదపాకలో బుధవారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పధకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సహజ వనరులను వైసిపి లూటీ చేస్తుందన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మరలా రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని, ప్రజలంతా ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, మండల అధ్యక్షుడు ముప్పడి సురేష్, మాజీ ఎఎంసి చైర్మన్ యినపకుర్తి తోటయ్యదొర, మాజీ ఎంపిపి మీసాల వెంకటరమణ, మాజీ జెడ్‌పిటిసి మధుబాబు, నడిమింటి చార్లస్, లంకలపల్లి జగ్గన్నదొర, కె.రమణనాయుడు పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని గొట్టిపల్లి, కూర్మన్నపేట గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి అమలు చేయనున్న పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భాస్కర్‌గౌడ, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు బూర్ల లలిత కుమారి, ఉర్లాన వసంత్, మాలతి శ్రీధర్, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: పెరిగిన ధరలు తగ్గాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, లేకుంటే కష్టాలు మరింత పెరుగుతాయని టిడిపి నాయకులు బోర అప్పారావు, చింతాల సింహాచలం, మస్తాన్‌లు అన్నారు. మండలంలోని పాకివలసలో బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి పోస్టర్లను అందజేశారు. ఆలాగే కోటబొమ్మాళి వైశ్యల వీధిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరావు, పెద్దబమ్మిడి, హరిశ్చంద్రపురం, సరియాపల్లి, తిలారు గ్రామాల్లో టిడిపి నాయకులు తర్ర రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు, హనుమంతు అప్పలరాజు నిర్వహించారు. కార్యక్రమంలో కోరాడ పెద్దగోవింద, ఎస్.రాంకుమార్, చిన్నగోవింద, దేవాది సింహాద్రి, కమ్మకట్టు అప్పలరాజురెడ్డి, తంగుడు సునీల్, పట్నాయక్ ఆను పాల్గొన్నారు.