Oct 12,2023 21:39

కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ బచ్చలి పుల్లయ్యచ టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి హయాంలో జరిగిన అభివద్ధిని వివరిస్తూ కరపత్రాల ద్వారా బాబుతో నేను అనే కార్యక్రమాన్ని పట్టణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్న జగన్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు జయప్రకాష్‌, నాయకులు భీమనేని కిష్టప్ప, బేకరీ నాయుడు, అమ్మినేని కేశవ, ముకుంద, బుద్ధప్ప, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : చంద్రబాబు నాయుడు కు మద్దతుగా నిలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటా టిడిపి కరపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్‌ మల్లిరెడ్డి, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు యశోద రాయుడు , టౌన్‌ కన్వీనర్‌ జంగం వెంకటరాముడు, మాజీ ఎంపీపీ బాలు, సుబ్బారెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు లావణ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
పరిగి : చంద్రబాబుతో నేను కార్యక్రమంలో భాగంగా పరిగి మండల కేంద్రంలో టిడిపి నాయకురాలు సవితమ్మ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకటేష్‌, గోవింద్‌ రెడ్డి, కంకర శ్రీనివాసులు, ఐ టిడిపి మంజునాథ్‌, నాగభూషణం, పాలెం చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : మండలం లోని కమ్మ వారి పల్లి, సిద్దన్న గారి పల్లి, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో గోనుగుంట్ల సూర్యనారాయణ అభిమానులు సంతకాల సేకరణ చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సేకరిస్తున్న ఈ సంతకాల సేకరణతో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, జయకృష్ణ, లోకేష్‌, బాలభాస్కర్‌, సురేష్‌ రెడ్డి, రామాంజి తదితరులు పాల్గొన్నారు