Oct 27,2023 22:12

ప్రజాశక్తి - దేవరపల్లి రాష్ట్రంలో అరాచక పాలనకు చర మగీతం పాడాలని మాజీ ఎంఎల్‌ఎ ముప్పి డి వెంకటేశ్వరరావు, జడ్‌పి మాజీ ఛైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు పిలుపునిచ్చారు. 'నిజం గెలవాలి' కార్యక్రమాన్ని మండలంలోని దుద్దుకూరులో నిర్వహించారు. ముందుగా టిడిపి, జనసేన నాయకులు ఎన్‌టిఆర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రావ్‌ విగ్రహాలకు పూలమాలవేసి కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సైకో ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగానికి ముగింపు పలికి ప్రజలకు సుభిక్ష పాలన అందించడానికి త్వరలో టిడిపి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనుడు జగన్‌ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.