
ప్రజాశక్తి-విశాఖపట్నం : రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఎపిసెట్) 2021 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.1200, బిసిలు రూ.1000, ఎస్‌సి, ఎస్‌టి, పిడబ్ల్యుడిలు రూ.700 రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్, ఎపిసెట్ వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఎపిసెట్ ప్రవేశ పరీక్షను అక్టోబరు 31వ తేదీన 30 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.