Jul 18,2022 00:21

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజు

ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 97వ వార్డు పరిధి సుజాతనగర్‌ ప్రాంతంలో రూ.3 కోట్లతో అప్రోచ్‌ రోడ్డుకు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ శంకుస్థాపన చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రతి ప్రాంత అభివృద్ధికీ రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారని తెలిపారు. పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి ప్రోత్సాహంతో నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ వసంత, వైసిపి నాయకులు పాల్గొన్నారు.