Jun 13,2023 00:04

సెల్‌ ఫోన్‌ వెలుతురులో ఓ పి చూస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి -కోటవురట్ల:మండల వ్యాప్తంగా గడిచిన నాలుగు రోజుల నుండి అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే ఎండలు ఆపై ఉక్కపోత విద్యుత్‌ కోతలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలు ఉక్క పోతతో అల్లాడిపోతున్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో విద్యుత్‌ సౌకర్యం లేక రోగులు సిబ్బంది అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు, చిరు వ్యాపారులు, కార్యాలయ ఉద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాలకు ప్రజలు పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా విద్యుత్‌ కోతలు విధించడంతో గృహోపకరణాలు సక్రమంగా పనిచేయక పోవడం తో తాగునీటికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.