ప్రజాశక్తి- పొందూరు: విఆర్‌ఎల న్యాయమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెండేలా త్రినాథరావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ గురువారం విఆర్‌ఎలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విఆర్‌లకు పేస్కేల్ అమలు చేయాలన్నారు. రికవరీ చేసిన డిఎను తిరిగి చెల్లించాలి, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. మృతి చెందిన విఆర్‌ఎ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాన్నారు. అర్హులైన విఆర్‌కలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు బి.ఈశ్వరరావు, సెక్రటరీ వైకుంఠరావు పాల్గొన్నారు.
నందిగాం : తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన దీక్షకు సిపిఎం నాయకులు పాలిన సాంబమూర్తి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు బి.రాములమ్మ, కృష్ణారావు, గణపతిరావు, బి.మీనాక్షి, కె.అర్జునుడు, కె.సీతమ్మ పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో అప్పారావు, శంకర్, రమేష్, రాంబాబు, పార్వతి, అరుణ పాల్గొన్నారు.
కంచిలి : అపరిస్కృతంగా ఉన్న విఆర్‌ఎల సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు సంగారు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపడుతున్న విఆర్‌ఎల దీక్షా శిబిరానికి సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయ కులు పిట్ట కృష్ణ, లోకనాథం, రమేష్ పాల్గొన్నారు.
పలాస : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో సింహాచలం, బి.లక్ష్మణ, వెంకటరావు పాల్గొనానరు.
కవిటి : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలు మండలల అధ్యక్షులు ఎన్ని కృష్ణ, జి.కేశవరావు, జనార్థనరావు, డుద్ది జగదీష్, జి.గణేష్, జి.మోహినమ్మ, తాతారావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆమదాలవలస : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో మండల అధ్యక్షులు కె.వి.రమణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్.రామారావు, కార్యదర్శి కె.ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎల్.రాజు పాల్గొన్నారు.
మెళియాపుట్టి : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో సంఘ సహాయకులు ఎన్.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు సిహెచ్.రామారావు, జనార్థన, గణపతి, మధు, కేశవరావు, లక్ష్మీకాంతం, ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తూరు : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో కె.రామారావు, సరస్వతి, సిహెచ్.రవి, కె.ఈశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ ఎం.చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.
కోటబొమ్మాళి : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో ఆ సంఘ మండల నాయకులు దేవాది లక్ష్మణరావు, గంగరాపు ఆనందరావు, ఉర్జాన రాజారావు, నివగాన రామారావు, కపిరి చిన్నారావు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్ : ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ వరకు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విఆర్‌ఎలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష పట్టారు. విషయం తెలుసుకున్న వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, జెడ్‌పిటిసి టి.సీతారాం, జెసిఎస్ కన్వీనర్ సిహెచ్.వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు విఆర్‌ఎల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. విఆర్‌ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.










