Apr 19,2023 16:50

జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి

అపరిచిత వ్యక్తుల వీడియో కాల్పై అప్రమత్తంగా ఉండండి
జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

    సైబర్ నేరాల పట్ల , సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ప్రజలను ఎలా  మోసం చేస్తున్నారో జిల్లా ఎస్పీ కె. రఘు వీర్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం  టెక్నాలజీ(టెక్నాలజీ ) అరచేతిలోకి రావడంతో ఆన్‌లైన్ కార్యకలపాలు విపరీతంగా పెరిగిపోయాయని అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య అధికమవుతుందని,సైబర్ నేరగాళ్లు కొన్ని పద్ధతులను ఉపయోగించి యూజర్లను మోసం చేస్తున్నారని తెలిపారు.వీడియో కాల్ ఫ్రాడ్, సోషల్ మీడియా యప్ ల ద్వారా అందమైన యువతుల ఫోటోలు,పేర్లతో ప్రొఫైల్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాలో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేసి  పరిచయం పెంచుకుంటారని,అనంతరం వీడియో కాల్ చేసి తద్వారా ఆ వీడియో కాల్ రికార్డింగ్స్  స్క్రీన్ షాట్ ఫొటోస్ ని మీకు పంపించి వినియోగదారులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారన్నారు.సైబర్ నేరాలు  నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు జాగ్రతలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
వీడియో కాల్ ఫ్రాడ్:-
ప్రస్తుతం  జరుగుతున్న నేరాలలో ఇది కూడా ఒకటి ముఖ్యంగా సోషల్ మీడియా యప్ ల ద్వారా  వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఇతర యాప్ ల ద్వారా అందమైన యువతుల ఫోటోలు,పేర్లతో ప్రొఫైల్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాలో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేసి  పరిచయం పెంచుకుంటారు.అనంతరం వీడియో కాల్ చేసి తద్వారా ఆ వీడియో కాల్ రికార్డింగ్స్ మరియు స్క్రీన్ షాట్ ఫొటోస్ ని మీకు పంపించి ఇవే ఫోటోలను మీ ఇంట్లో వాళ్లకి పంపిస్తాము అని మానసిక వేదనకు గురిచేస్తారు. ఈ విషయాన్ని ఎవరితోనో పంచుకోలేక మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. అంతేకాక మీకు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్,ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ ,ఫేస్బుక్ ,మరియు ఏ ఇతర సోషల్ మీడియా యాప్ ల ద్వారా వీడియో కాల్ గాని  వచ్చినట్లయితే మీరు ఆ కాల్ ని లిఫ్ట్ చేయకండి. ఎందుకనగా వీడియో కాల్ చేయడం ద్వారా అవతల వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా గురిచేసి వాటిని రికార్డ్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని  వెంటనే కాల్ కట్ చేసి మళ్ళీ తిరిగి కాల్ చేసి గాని లేదా మరొక నెంబర్ నుండి మీకు కాల్ చేసి మిమ్మల్ని బెదిరింపులకు గురి చేయవచ్చు తద్వారా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి  మిమ్మల్ని బెదిరింపులకు గురిచేసి మానసిక వేదనకు గురి చేసి మీ వద్ద నుండి డబ్బులు కాజేసే  ప్రయత్నం చేస్తారు కావున తెలియని నెంబర్ నుంచి వచ్చిన వీడియో కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిది.ఒకవేళ ఇలాంటి వాటికి గురైన వారు వెంటనే పోలీసులను సంప్రదించండి.అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచి భాదితులకు న్యాయం చేసే విదంగా పోలీసు వారు చర్యలు తెసుకుంటారు. కావున అపరిచుతుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్తులు అంగీకరించవద్దు.మీరు పనిచేసే కార్యాలయ వివరాలు ,వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవద్దు.సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింక్ లను ఓపెన్ చేయవద్దు.  ఒకవేళ ఎవరైనా పైన తెలిపిన సైబర్ నేరాలకు గురికాబడి ఉంటే మీరు వెంటనే 1930 కి కాల్ చేసి గాని www.cybercrime.gov.in లో 24 గంటల లోపల  ఫిర్యాదు చేయండి. లేదా మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి గానీ మీరు ఫిర్యాదు చేసిన మీ వివరాలు గొప్పంగా ఉంచడం జరుగుతుందని,కావున అపరిచుతుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్తులు అంగీకరించవద్దు.మీరు పనిచేసే కార్యాలయ వివరాలు ,వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవద్దు.సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింక్ లను ఓపెన్ చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు.