ప్రజాశక్తి- నక్కపల్లి:అపరాల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి ఉమాప్రసాద్ రైతులకు సూచించారు. మండలంలోని బుధవారం కాగిత, వేంపాడు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మినుము, పెసర పంటలను పరిశీలించారు. చిత్త పురుగు సోకడం గమనించి నివారణ చర్యల పై రైతులకు అవగాహన కల్పించారు. 2.5మిల్లీ క్లోరిపైరిఫోస్ లేక 1.6 మిల్లీ మోనో క్రోటోఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. పసుపు ఆకు తెగులు నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా ఏసిఫేట్1.5 గ్రాము లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఆర్‌బికే లకు ధాన్యం ఈనెల 15 లోపు రైతులు విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు రాజేష్, మోహన్,నాయుడు, రైతులు పాల్గొన్నారు.










