వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న వంశీరెడ్డి
ప్రజాశక్తి- గాజువాక : 74వ వార్డు సిద్ధేశ్వరంలో నందికి అప్పయ్యమ్మ ప్రధమ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అప్పయమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు సమకూర్చిన దుప్పట్లు, పండ్లును వృద్ధులు, వికలాంగులు, పేద మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్‌రెడ్డి, అప్పయ్యమ్మ కుమారుడు నందికి తాతారావు, పులి వెంకటరమణా రెడ్డి, మార్డుపూడి పరదేశి, పిట్టా రెడ్డి, గొందేశి వెంకటరమణా రెడ్డి, తోకాడ అప్పారావు, మొల్లి పెంటిరాజు, కణితి అప్పలరాజు, గొర్సు సత్యం, పాల అప్పలరెడ్డి, నందికి అప్పలరెడ్డి, రావాడ శివ, నందికి చిన్నారావు, గొందేశి ప్రభాకరరెడ్డి, పాల వెంకయ్య, పాల్గొన్నారు










