Jul 18,2022 00:22

బాదుడే బాదుడునుద్దేశించి మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

ప్రజాశక్తి -గాజువాక : రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దీంతో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా మారిపోతుందని విశాఖ పార్లమెంట్‌ నియోజవర్గ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ 75వ వార్డు పరిధిలో టిడిపి ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతానగరం జంక్షన్‌ వద్ద ఆయన మాట్లాడుతూ, ఓట్లు కోసం ఈ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పులి లక్ష్మీబాయి, పులి రమణారెడ్డి, కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, ప్రసాదు శ్రీనివాస్‌, పెంట రాజు, రమణ బాబు తదితరులు పాల్గొన్నారు.