Jul 30,2022 23:55

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబీకులు

ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్నను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఒ ఎంవి సూర్యకళ, ఏఈఓ ఆనంద్‌ కుమార్‌ ఆలయ సంప్రదాయం ప్రకారం సాధనంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామి అంతరాలయంలోనూ, గోదాదేవి సన్నిధిలోను గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. ఈవో సూర్యకళ మంత్రిని సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు.