
కప్ప స్తంభం వద్ద కృష్ణమాచార్య శ్రీకాంత్
ప్రజాశక్తి-సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం సాయంత్రం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ యూనియన్ మినిస్టర్ భగవంతు కుబ, మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి భ్రమరాంబ, పర్యవేక్షకులు త్రిమూర్తులు స్వాగతం పలికారు. వీరు ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామి అంతరాలయంలోనూ, గోదాదేవి సన్నిధిలోనూ, గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.