ప్రజాశక్తి-వేపగుంట : జివిఎంసి 94వ వార్డు పరిధి అప్పలనరసింహ నగర్ వద్ద కాలనీ అభివృద్ధి కమిటీ నిర్మించిన ముఖద్వారాన్ని గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ కె.అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ముఖ ద్వారం నిర్మాణానికి హెల్పింగ్ హేండ్స్ వ్యవస్థాపకుడు యతిరాజుల నాగేశ్వరరావు ఎక్కువ మొత్తంలో విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. యతిరాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అప్పలనరసింహనగర్ కాలనీని ప్రగతిపధంలో నిలపడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పలనరసింహనగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అభివృద్ధి కమిట సభ్యులు సిఐని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హేండ్స్ ప్రధాన కార్యదర్శి కంచిపాటి జగదీష్, కమిటీ సభ్యులు వంకర చినఅప్పారావు, శ్రీనివాసరావు, బల్ల శ్రీనివాసరావు, గంట్ల శ్రీనివాస్, తవిటినాయుడు, కూన రామరాజు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.










