
పల్నాడు జిల్లా: రక్తదానం పట్ల అపోహలు వీడి యువతతో పాటు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నరసరావు పేట డిఎస్పీ కెవి మహేష్ అన్నారు. స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శనివారం చేప ట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ కెవి మహేష్, వాగ్దేవి డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావులు కలిసి ప్రారంభించారు. డిఎస్పీ మాట్లా డుతూ రక్తదానం ప్రాణదానంతో సమాన మన్నారు. వివిధ ప్రమాదాల బారిన పడి రక్తం అందక ఎందరో మృత్యువాత పడు తున్నారన్నారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజ మాన్యాన్ని ఈ సందర్భంగా అభినందిం చారు. రాయల శ్రీనివాసరావు మాట్లా డుతూ విజయ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబి రంలో తమ కళాశాలకు చెందిన విద్యా ర్థులు 60 మంది రక్త దానం చేశారన్నారు. తమ కళాశాల విద్యార్థులు రక్త దానం చేసేందుకు ముందుకు రావడం పట్ల విద్యార్థులను అభినందించారు. రక్తదాతల సంఖ్య పెరగాలని అందుకు యువత ముందుకు రావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ కపలవాయి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉం డాలని, ఆరోగ్య భారత నిర్మాణానికి పాటు పడాలని ఆకాం క్షిం చారు. 60 మంది విద్యా ర్థులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యారు ్థలను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, ఒ.నాగేశ్వరరావు, ఎం.కోటేశ్వరరావు, ఎస్. సురేష్‌బాబు, పి.కృష్ణారావు, ఇస్కేపల్లి క్రిష్ణకిషోర్ అభినందించారు. విజయ బ్లడ్ సెంటర్ నరసరావుపేట బ్రాంచి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.వెంకట రమణ మాట్లాడారు. రక్తదాతలకు సావి యో ఫౌండేషన్ ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని బ్లడ్ సెంటర్ నిర్వా హకులు తెలిపారు.