
ప్రజాశక్తి -నెల్లూరు : రాష్ట్రంలో త్వరలో నిర్వహించతలపెట్టిన కుల,గణన కు ఇప్పటికే అమలు లో ఉన్న సంక్షేమ పధకాలకు ఎటువంటి సంబంధం లేదని దానిపై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాథ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎపి కులగణన -2023కు సంబంధించి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఇందులో వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఎన్‌జిఒలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాథ్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి కుల గణన చేపట్టనున్నామని, ఇందులో ప్రజలు తెలిపిన వివరాలు నమోదు చేస్తారన్నారు. జెడ్‌పి సిఇఒ చిరంజీవి మాట్లాడారు. ల్లాలోని వివిధ కుల సంఘ నాయకులు వెంక య్య,, చెంచయ్య, శ్రీహరి రావు, మస్తానమ్మ, సుబ్బయ్య తదితరులు కులగణన గురించి తమ అభిప్రాయాలను తెలిపారు. రాష్ట్ర జంగమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ వి ప్రసన్న, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యో గుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సైదాని, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషన్ సింగ్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి, ఎస్సి సంక్షేమ శాఖ డిడి రమేష్ ఉన్నారు.