Aug 11,2023 21:48

ప్రజాశక్తి - మొగల్తూరు
           ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కొవ్వలి ఫౌండేషన్‌ ముందుంటుందని ఆ సంస్థ సభ్యులు అన్నారు. మండలంలోని కెపి పాలెం సౌత్‌ యాళ్ల వారి మెరకకు చెందిన మల్లిపూడి వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వెంకటేశ్వరరావుకు కొవ్వలి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడు ఆదేశాల మేరకు రూ.10 వేలు ఆర్థిక సాయం కొవ్వలి ఫౌండేషన్‌ ద్వారా శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో సంకు భాస్కరనాయుడు, యాళ్ల అబ్బులు, యాళ్ల నరసింహరావు, లక్కు శ్రీను, తోట సత్యనారయణ, యాళ్ల కృష్ణ, గన్నాబత్తుల బెనర్జీ, రంగిసెట్టి శివ, మల్లాడి మూర్తి, యర్రంశెట్టి నాగేశ్వరరావు, రేవు పద్మారావు, గ్రంధి లక్ష్మీనాయుడు, నిమ్మకాయల బాబ్జి, ముత్యం పాల్గొన్నారు.