Aug 05,2023 20:55

దీక్షలను ప్రారంభిస్తున్న వెంకటసుబ్బయ్య

కడప అర్బన్‌ :ఆప్కాస్‌ ఉద్యోగులను రెగ్యుల్‌ చేయాలని ఆప్కాస్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎం.రవి ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పి.వి.సుదర్శన్‌, కంచుపాటి ఏసన్న, సురేష్‌ కుమార్‌, రఘు, శంకర్రావు, రాజారత్నం కూర్చున్నారు. వీరికి పూలమాలవేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్‌ కార్మికులకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు కావడం లేదని పేర్కొన్నారు. దీనికి కారణం ఆన్‌లైన్‌లో ఆప్కాస్‌ కార్మికులను రెగ్యులర్‌ కార్మికులుగా చూపిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ కార్మికులను ప్రత్యక్షంగా మోసం చేస్తా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు వేరు కాదు, అవుట్‌ స్సోర్సింగ్‌ వేరు కాదు అన్న సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలో రాగానే విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఆప్కాస్‌ లో పనిచేస్తున్న కార్మికుల తల్లిదండ్రులకు వద్ధాప్య, వికలాంగ పింఛన్లు రావడం లేదని చెప్పారు. వారి పిల్లలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వికలాంగుల పింఛన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కాస్‌ కార్మికులు ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి కూడా పెన్షన్‌ రావడం లేదని పేర్కొన్నారు. గతంలో అన్ని సంక్షేమ పథకాలు వర్తించేవని చెప్పారు. ప్రస్తుతం అమలుకాకుండా ఆప్కాస్‌ కార్మికులను మరింత దయనీయ పరిస్థితిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే సమాన పనికి సమాన వేతనం అందిస్తామన్నారని, ఇప్పుడు కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఆప్కాస్‌ కార్మికులను ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 14న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్దకు పెద్ద ఎత్తున ఆప్కాస్‌ కార్మికులందరూ చేరుకుని ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాని పిలుపు నిచ్చారు. ఆందోళనలు ఉద్ధతం చేస్తామని, దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పి.చంద్రారెడ్డి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, ఆప్కాస్‌ కమిటీ సభ్యులు మరియమ్మ, రామకష్ణ, చెన్నయ్య, శ్రీనివాసులు, బాలాజీ రావు, జయ కాంత్‌ బాబు, వెంకటనారాయణ, కార్మికులు పాల్గొన్నారు.