కడప అర్బన్ : నగరంలోని ఎన్‌జిఒ కాలనీలో ఓ ప్రయి వేట్ పాఠశాలలో పదవ తరగతి చదువు తున్న సంగీత అనే విద్యార్థి అపార్ట్‌మెంట్ నుంచి కిం దపడింది. ప్రమా దవశాత్తు కింద పడిందా, ఆత్మహత్యకు ప్రయత్నించిందా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సంగీత తండ్రి గంగయ్య కూలీ పని చేసుకుంటూ రామాంజనేయ పురంలో నివాసం ఉంటున్నాడు. ఒరిస్సా నుంచి వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజ యరామరాజు విద్యార్థిని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయిని చిన్నచౌక్ సిఐలు పరామర్శించారు. ఈ ఘటనపై డిఎస్‌పి షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా డాక్టర్లు అనస్తీసియా ఇవ్వడం వల్ల సరిగా చెప్పలేక పోయిందని పేర్కొన్నారు. ప్రస్తు తానికి గాయాల తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉందని తెలిపారు. గాయాలతో ఉన్న విద్యార్థిని ఒకటి, రెండు ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసేందుకు నిరాకరిం చినట్లు తమ దష్టికి వచ్చిందన్నారు. వీరిపై వైద్య ఆరోగ్యశాఖ, రీజినల్ డైరెక్టర్, ఐఎంఎ, కలెక్టర్, రాష్ట్ర సెక్రటరీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు.
విద్యార్థిని పరామర్శిస్తున్న సిఐలు










