Jul 30,2021 09:43

అమరావతి : ఎపి సీడ్స్‌కు జాతీయ అవార్డు దక్కింది. సర్టిఫైడ్‌ విత్తనాలను ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు పంపిణీ చేసి రైతులకు లబ్ధి చేకూర్చిన కారణంగా... సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఎపి సీడ్స్‌) ను జాతీయ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్‌ మాలకొండయ్య, కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, సీడ్స్‌ ఎండి శేఖర్‌ బాబు, ఇతర సిబ్బందిని అభినందించారు. గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనాలను ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు పంపిణీ చేయడంతో రైతులకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా భారం తగ్గిందని చెప్పారు. ఊళ్లోనే రైతులకు విత్తనాలు అందాయని, ఈ విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని మంత్రి కన్నబాబు హర్షాన్ని వ్యక్తపరిచారు.