Sep 22,2023 15:57

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  అక్టోబర్ ఒకటవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే రెవెన్యూ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సి ఆర్ ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని  అన్నమయ్య జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్డిఓ రామకృష్ణారెడ్డి, తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి కౌన్సిల్ సమావేశ గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ సహాయకుల నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ శాఖ మరియు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి.సాయి ప్రసాద్ ఐ.ఏ.ఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతను చాటడానికి  నిర్వహించే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.