Aug 05,2021 20:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగన్‌ ప్రభుత్వం 25 నెలల్లో రూ.1,49,212.11 కోట్ల అప్పు చేసిందని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో రూ.1,30,146.98 కోట్లు చేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.26 వేల కోట్లు అప్పు చేస్తే, వైసిపి ప్రభుత్వం ఏడాదికి బడ్జెట్‌ అప్పులే సరాసరి రూ.50 వేల కోట్లు చేసిందని వివరించారు. జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, సంక్షేమం కుదించారని విమర్శించారు. మంత్రివర్గం చేసిన తప్పిదాలకు అధికారులు, ఉద్యోగులను బాధ్యులు చేసి శిక్ష వేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అప్పులు, సంక్షోభానికి మంత్రివర్గ అవినీతి, దుబారాలే ప్రధాన కారణమని ఆరోపించారు.