
అమరావతి : రాష్ట్రవాప్తంగా గడిచిన 24 గంటల్లో 85,283 నమూనాలు పరీక్షించగా.. 2,050 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13,531కి చేరింది. ఇదే సమయంలో 2,458 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,93,429 నమూనాలను పరీక్షించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.